Monday, May 6, 2024

పెద్దపులి చర్మ స్వాధీనం: 10 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Tiger skin seizure and 10 arrested in adilabad

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని ఆదివారం నాడు అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్టు చేసారు. ఈక్రమంలో నిందితులు పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ఇంద్రవెల్లి మండంలోని హీరాపూర్ అటవీ ప్రాంత పరిధిలోని వాల్గొండ వద్ద నిందితులు కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీ అధికారులు, పోలీసులు నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత

పులిని చంపిన కేసులో నిందితుల అరెస్ట్‌తో ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించడంతో పాటు అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు. అటవీశాఖ అధికారుల వాహనాల్లో గాలి తీసి నిరసన వ్యక్తం చేశారు. దండారి పర్వదినాల్లో బూట్లు వేసుకుని ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తొలుత గ్రామస్థుల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పులిని చంపారన్న ఆరోపణలతో అరెస్టుకు వచ్చిన అధికారులపై దాడికి యత్నించారు. కాగా పులిని చంపిన కేసులో 10 మంది అనుమానితులను బలవంతంగా తీసుకెళ్తున్న వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. గ్రామస్తులను చేధించుకొని వాహనంలో వెళ్లిపోయారు. పులి చర్మం కేసులో అమాయకులను అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు.

ఒకటి కాదు రెండు పులులు 

పులులకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో రెండు పెద్ద పులులను స్మగ్లర్లు చంపి వాటి చర్మాన్ని, గోర్లను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో జరిగిన ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి రాగా అధికారులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో రెండు పులుల హతం అయినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో ఒక చర్మాన్ని పట్టుకున్నట్టు అధికారులు మరో పులికి సంబంధించిన చర్మం పక్క రాష్ట్రానికి తరలించినట్టు అనుమానిస్తున్నారు. పులలను చంపి వాటి గోళ్లు, చర్మం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇంద్రవెళ్లి, హీరాపూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో అటు అటవీశాఖ అధికారులు, ఇటు పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News