Friday, May 10, 2024

శుక్రవారం రాశి ఫలాలు(02-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథునం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కర్కాటకం – రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభాలు పొందుతారు.

సింహం – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.

కన్య – అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు.

తుల – పనులలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు పొందుతారు. వస్తు లాభం.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమైన ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు.

ధనుస్సు-  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మొండి వ్యాధులు కాస్త తగ్గుముఖం పడతాయి.

మకరం – శ్రమకు తగిన లాభం పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.మానసిక ఆనందం కలిగి వుంటారు. వాహన సౌఖ్యం.

కుంభం – బంధువుల నుండి ధన లాభం పొందుతారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ.

మీనం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో  స్వల్ప లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News