Friday, May 10, 2024

సోమవారం రాశి ఫలాలు(15-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

వ్యషభం –  కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.

మిథునం – సోదరులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.

కర్కాటకం – పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి నుండి సహయ సహకారాలు అందిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందును.

సింహం – ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానమునకు నూతన విద్యావకాశాలు.

కన్య –  మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఋణాలు తీరి ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. మీ మాటకు వెలువ పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ధనలాభం.

తుల – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు.

వ్యశ్చికం – కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తు లాభం.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు.

మకరం – దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం వాహనాల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల కలయిక.

కుంభం – రెండు, మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. పాతమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.

మీనం – మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News