Monday, May 13, 2024

సోమవారం రాశి ఫలాలు(23-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు ఉంటాయి.

వృషభం:- నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలోగౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం:- నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసిఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితికొంత అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు  ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం :- ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినాచివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ద వహించకండి.శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు నడిపే విషయాలలో నిర్లక్ష్యంతగదు.

సింహం:- చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు.వృత్తి-వ్యాపారాలలోఅభివృద్ధి సాధిస్తారు.ఉద్యోగస్తులకి పదోన్నతులు లభిస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:- మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందంకలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగానిర్వహిస్తారు.

తుల:- శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తుఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలుపొందుతారు.

వృశ్చికం :-ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైనపనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వన్తు లాభం కలుగుతుంది.

ధనుస్సు :- మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.పెట్టుబడులకు తగినలాభాలు పొందుతారు. సాంకేతికవిద్యావకాశాలు గోచరిస్తున్నాయి. కార్యాలయాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగానిర్వహిస్తారు.

మకరం :- కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలుపెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆర్ధికంగా కొంత అనుకూలం.

కుంభం :- దీర్ధకాలిక సమన్యలు ఎదురైన అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలుఅందుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరుల కలయిక అనందోత్యవాలు వెల్లువిరుస్తుంది. స్నేహితులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి.

మీనం :-జీవిత భాగస్వామి నుండి విలువైన సమాచారం తెలుసుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు.వాహనయోగం. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News