Friday, May 3, 2024

అమరుల త్యాగాల వల్లే నేటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

వేములవాడ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరులకు అంకితం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు నా వెనుక ఉన్నటువంటి ఈ అమరవీరుల స్థూపం అంటే అమరవీరుల త్యాగం లేనిదే తెలంగాణ ఉండేది కాదు. మరి తెలంగాణ లేని దశాబ్ది ఉత్సవాల అవసరం కూడా ఉండేది కాదు అంటే అంత గొప్ప త్యాగం చేసి ఈ త్యాగాలు అన్నింటిని కూడా ప్రొ.జయశంకర్ సార్ చాలా మంది మరి తెలంగాణ ఉద్యమ నేతలు కేసిఆర్ నాయకత్వంలో పోరాటం నడిపి మన రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.

ఈ రాష్ట్రం ఒక 60సంవత్సరాల పోరాటం తరువాత మనకు వచ్చింది. ఎప్పుడైతే నిజాం నియంత పాలన పోయిందో 1948 లో సెప్టెంబర్ 17 నాడు ఆ తరువాత మన స్వేచ్ఛగా హైదరాబాద్ సంస్థానంగా ఉంటుందని అనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం వారు మన అప్పటి తెలంగాణను మద్రాసు నుండి బయటకువచ్చినటువంటి ఆంధ్రతో విలీనం చేసిందన్నారు.

మనం 60 సంవత్సరాల పాటు అక్కడున్నటువంటి ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయినటువంటి విషయం ప్రజలందరూ గ్రామ గ్రామానా వేములవాడ లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇంటి ముందుకు వచ్చి సకల జనుల సమ్మెలో వంట వార్పు చేశామని, నిరాహార దీక్షలు చేసామని, అందరికంటే గొప్ప త్యాగాలు చేసిన వాళ్లని ఇవాళ ప్రాణాలు అర్పించిన వాళ్లకు మనం నివాళులు అర్పించుకుంటున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాల గడ్డమీద వెలసినటువంటి రాష్ట్రం మీకు తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల బడ్జెట్‌లో అన్ని రకాల అభివృద్ది చెందినటువంటి రాష్ట్రంలో మీరందరూ కూడా అభివృద్ది చెందుతూ మీ అందరు కూడా స్వేచ్ఛగా ముందుకు పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది అమరుల త్యాగాల ఫలం.

నాటి ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో చేసిన పోరాటం మాత్రమే అని అన్నారు. ఒకప్పుడు ఎండాకాలంలో త్రాగుదామంటే మంచినీళ్లు దొరకని పరిస్థితి ఉండే కానీ వేములవాడ పట్టణంలో తొమ్మిదివ వేల కుటుంబాలకు మన మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు ఇస్తున్నామని అన్నారు. అలాగే గుడి చెరువును మిషన్ కాకతీయ ద్వారా పూర్తిగా పూడికలు చేసి మద్య మానేరు జలాశయం నుండి లిప్ట్ పెట్టి గత నాలుగు సంవత్సరాలుగా గుడి చెరువు ఎండిపోతలేదు.

అలాగే తెలంగాణ వచ్చిన తరువాత 600గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్ధి, విద్యార్థిని మీద 1లక్ష 15వేల రూ.లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు. 2014లో తెలంగాణ రాకముందు తెలంగాణలో సగటు ఆదాయం 1,17,000 ఉంటే ఇవాళ 3లక్షల 17వేల రూ.లకు పెరిగింది అంటే నిజంగా కూడా అది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ది అన్నారు. ఈ విషయం విద్యార్థులు గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, కమిషనర్ అన్వేష్, పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్, జడల లక్ష్మి, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, యాచమనేని శ్రీనివాస్ రావు, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, బింగి మహేష్, గోలి మహేష్, కో ఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, గడ్డం హన్మండ్లు, నీరటి మల్లేశం, కొండ కనుకయ్య, సలీం, ఆరె సత్యనారాయణ, పెంట బాబు, దమ్మ భాస్కర్, టైలర్ శ్రీనివాస్, కృష్ణమూర్తి, పీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News