Saturday, May 4, 2024

కేసీఆర్, మోడీ బంధం మరోసారి బయటపడింది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్, మోడీ మధ్య బంధం మరోసారి బయటపడిందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ కు ముందు రైతుబంధుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లోనే ఐటి దాడులు జరుగుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. గోయల్ ఇంట్లో రూ. 300 కోట్లు దొరికితే సీజ్ చేయలేదు ఎందుకు అని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేన్నారని పేర్కొన్నారు.

నవంబర్ 15లోపే రైతుబంధుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరామన్నారు. పోలింగ్ కు ముందురోజు రైతుబంధుకు అనుమతి ఇచ్చారన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కెసిఆర్ కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు రైతుబంధు వల్ల రైతులకు రూ. 5వేలు నష్టం అన్నారు. డిసెంబర్ లో అయితే రూ. 15వేలు రైతు భరోసా వచ్చేదని ఆయన వెల్లడించారు. కౌలు రైతులు, రైతు కూలీలుగా పూర్తిగా నష్టపోతున్నారని తెలిపారు. సీఈవో వికాస్ రాజ్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ఎత్తటం లేదని ఆరోపించారు. బిఆర్ఎస్ చేసే ఓట్ల కొనుగోలుకు బిజెపి సహకరిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News