Tuesday, May 7, 2024

నల్సారు స్కీములపై ప్యారా లీగల్ వాలంటరీలకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training for Para Legal Volunteers on Nalsaru Schemes

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్యారా లీగలు వాలంటరీలకు, ప్యానల్ లాయర్లకు, నల్సారు స్కీములపై సోమవారం నాడు ట్రైనింగు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్యానలు లాయర్లకు, ప్యారా లీగలు వాలంటరీలకు వారి బాద్యతలను, విధులను ఎలా నిర్వహించాలన్న అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. పేద ప్రజలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించే కార్యక్రమాలు ఎలా ప్రజలలోకి వెళ్లాలి, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఇటు బట్టీలలో పనిచేసే కార్మికులకు లేబరు కార్డులు ఉబితంగా ఎలా అందజేయాలి అనే విషయంపై ప్యారా లీగలు వాలంటరీలకు వివరించడం జరిగిందన్నారు. నల్సారు స్కీంలలో పనిచేస్తున్న పి.ఎల్.వి లకు, న్యాయవాదులకు నల్సారు స్కీంలు పేద ప్రజలకు ఉపయోగపడటానికి కావాల్సిన నైపుణ్యతను వారికున్న ఎక్స్ పీరియన్స్‌ను అడిగి తెలుసుకున్నారు. సోమవారం నాడు లోక్ అదాలత్ లో ఒక మోటారు వాహన ప్రమాద కేసును పరిష్కరించి, యూనివర్సల్ సాంపో జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ వారి నుండి బాధితులకు రూ. 1,36,00,000 రూపాయలను ఇప్పించామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News