Monday, May 6, 2024

దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు ముఖ్య గమనిక..

- Advertisement -
- Advertisement -

దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్య గమనిక
స్పెషల్ ట్రెయిన్‌ల టైమింగ్స్ మారాయి


మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్‌ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు మారిన టైమింగ్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణమధ్య రైల్వే మార్చిన 14 స్పెషల్ ట్రైన్స్ జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.

రైలు నెంబర్ 02723

రైలు నెంబర్ 02723 హైదరాబాద్ నుంచి నుంచి న్యూ ఢిల్లీకి వెళ్తుంది. ప్రతి రోజు ఈ రైలు ఉదయం 6.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి న్యూ ఢిల్లీకి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యలో కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్, మథుర జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02702

రైలు నెంబర్ 02702 హైదరాబాద్ నుంచి ముంబై మధ్య నడుస్తోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.55 గంటలకు ముంబై చేరుకుంటుంది. బేగంపేట, వికారాబాద్, తాండూర్, సేడం, చిత్తాపూర్, వాడీ, షాబాద్, కలబుర్గి, గానగాపూర్ రోడ్, సోలాపూర్ జంక్షన్, కుర్దువాడి జంక్షన్, పూణె జంక్షన్, కళ్యాణ్ జంక్షన్, దాదార్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02728

రైలు నెంబర్ 02728 గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. సాయంత్రం 5.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02285

రైలు నెంబర్ 02285 సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ప్రతి ఆదివారం, గురువారం వెళుతోంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 02704

రైలు నెంబర్ 02704 సికింద్రాబాద్ నుంచి హౌరా జంక్షన్ ప్రతి రోజూ వెళుతోంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 05.40 గంటలకు హౌరా జంక్షన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 02791 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ప్రతి రోజూ వెళ్తుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 06.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07007

రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి దర్భంగా వెళ్తుంది. ప్రతి మంగళవారం, శనివారం రాత్రి 10.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు దర్భంగా జంక్షన్‌కు చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07202

రైలు నెంబర్ 07202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. మౌలాలి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘణపూర్, కాజీపేట్ జంక్షన్, వరంగల్, నెకొండ, కేసముద్రం, మహబూబాబాద్, గార్ల, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, విజయవాడ జంక్షన్, మంగళగిరి స్టేషన్‌లో ఆగుతుంది.

రైలు నెంబర్ 07201

రైలు నెంబర్ 07201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. గుంటూరులో ఉదయం 6.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మంగళగిరి, విజయవాడ జంక్షన్, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్ జంక్షన్, ఘణపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగుతుంది.

రైలు నెంబర్ 02794

రైలు నెంబర్ 02794 నిజామాబాద్ నుంచి తిరుపతి ప్రతిరోజూ వెళుతోంది. మధ్యాహ్నం 2.05 గంటలకు నిజామాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో కామారెడ్డి, సికింద్రాబాద్, బేగంపేట్, సనత్‌నగర్, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, చిత్తాపూర్, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ముద్దనూరు, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02793

రైలు నెంబర్ 02793 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యెర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయిచూర్, చిత్తాపూర్, సేడం, తాండూర్, వికారాబాద్, శంకరపల్లి, లింగంపల్లి, సనత్‌నగర్, బేగంపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. రైలు నెంబర్ 02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు ప్రతి మంగళవారం రైలు బయల్దేరుతుంది. తెల్లవారుజామున 3.55 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, రాయనపాడు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02775

రైలు నెంబర్ 02775 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు వారంలో మూడు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02776

రైలు నెంబర్ 02776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. రాత్రి 7.00 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రైలు దారిలో బేగంపేట్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02784

రైలు నెంబర్ 02784 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రతి వారం ప్రత్యేక రైలు నడవనుంది. రాత్రి 9.35 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దారిలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో రైలు ఆగుతుంది.

రైలు నెంబర్ 02708

రైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో రైలు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News