Wednesday, May 1, 2024

జమ్మి చెట్లను నాటిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్

- Advertisement -
- Advertisement -

Trees are planted in Green India challenge

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు..కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, ఆర్యవైశ్య సంఘం లంగర్ హౌస్ లో ఆరు 6 జమ్మి చెట్లు, రాజేంద్ర నగర్ గంధం గూడ, తుల్జా భవాని రేణుక ఎల్లమ్మ దేవాలయం పిరం చెరువు ఆలయంలో 6 జమ్మి చెట్లను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నాటారు.

మంగళవారం ఉదయం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో.. ఆర్యవైశ్య సంఘం లంగర్ హౌస్ వాసవి మాత ఆలయంలో ఆరు జమ్మి చెట్లు, రాజేంద్ర నగర్ తుల్జా భవాని రేణుక ఎల్లమ్మ ఆలయం గంధంగూడ, పిరం చెరువు ఆలయంలో 6 ఆరు జమ్మి చెట్లు నాటారు.

ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్త అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మీడియాతో మాట్లాడారు.
ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు  దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారని, తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టుని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుందని ఉప్పల ప్రశంసించారు. మంగళవారం జమ్మి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందని, అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టతరీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకవచ్చారని కొనియాడారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశిష్టమైన చెట్లను పెంచుదామని.. భవిష్యత్ తరాలను కాపాడుకుందామని ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు.

తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారమని, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీగా ఉందన్నారు. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరు ఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మిచెట్లు నాటేందుకు జమ్మి మొక్కలు సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమంలాగానే దీనిని కూడా విస్తృతంగా ప్రాచారం చేయటంతో పాటు, ప్రతీ ఊరిలో-ప్రతీ గుడిలో జమ్మి వృక్షం ఉండేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత తరానికి జమ్మి చెట్లు అంటే కేవలం దసరా రోజు మాత్రమే గుర్తుకు వస్తుందని, పురాణ కాలం నుంచి మన చరిత్రలో జమ్మికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్, ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ముస్త్యాల శ్రీనివాస్, కంచర్ల వెంకటేష్ గుప్త, శ్రీనివాస్, రెడిశెట్టి కృష్ణమూర్తి, మేడ సత్యనారాయణ, కల్వకుంట విజయ లింగం, రాజేష్, గోవిందు, ప్రవీణ్, లక్ష్మినారాయణ, బచ్చ సంతోష్, బాశెట్టి అశోక్,లక్ష్మణ్, గంధంగూడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ కటారీ రాం నరేష్, సిహెచ్ రమేష్ గౌడ్, ఐవిఎఫ్ లంగర్ హౌస్ ప్రెసిడెంట్ విశ్వనాదుల సురేందర్, ఐవిఎప్ జనరల్ సెక్రటరీ విశ్వేశ్వర రావు, ఐవిఎఫ్ మహిళా విభాగం హైదరాబాద్ అధ్యక్షురాలు విశ్వ జ్యోతి, ఐవిఎఫ్ ఆర్యవైశ్య సంఘం బాబు రావు, ఐవిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ, ఐవిఎఫ్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రేష్టీ, బి. రాములు నాయక్, నల్ల చంద్రా రెడ్డి, రామస్వామి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News