Wednesday, May 1, 2024

‘టోకెనిజం’పై మాకు నమ్మకం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

Modi prefers economic issues to national security

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు “గిరిజన అభ్యర్థి” అయిన ద్రౌపది ముర్మును నామినేట్ చేసిన ఎన్ డిఏ నిర్ణయాన్ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు (కెటిఆర్) సోమవారం “టోకనిజం” గా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో దెబ్బతింటున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తోందని తెలిపారు. సిన్హాకు మద్దతుగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ) జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన నేత, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా నిలిపింది. ‘‘టోకెనిజంపై మాకు నమ్మకం లేదు. ఇది ముర్ము అభ్యర్థిత్వం గురించి కాదు.  రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులపై ఎక్కువగా ఆధారపడే పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే బిజెపి అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని కెటిఆర్ విలేకరులకు తెలిపారు. ‘‘రాజ్యాంగబద్ధమైన కార్యాలయాలన్నింటిని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పాలి’’ అని ఆయన అన్నారు.

గత ఎనిమిదేళ్లలో గిరిజన సంక్షేమానికి బిజెపి చేసిందేమీ లేదని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నేటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. ‘‘టోకెనిజంపై మాకు నమ్మకం లేదు. ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చిన యశ్వంత్ సిన్హాజీకి మద్దతివ్వడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ఆయన చాలా మంది సారూప్య ఓటర్ల మద్దతుతో  ఎన్నుకోబడతారని మేము ఆశిస్తున్నాము, ”అని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News