Monday, April 29, 2024

ఇద్దరూ ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ఎన్నిక

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్
అధికారి, సిఎం కెసిఆర్‌కు ఎంపిల కృతజ్ఞతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం నుంచి నుంచి రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం నాటి తో ముగిసింది. దీంతో రెండు స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డిలు మాత్రమే బరిలో మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఈ మేరకు వారు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు పొందారు. వారి వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు(గాయత్రి) రవిచంద్ర, ఎంఎల్‌సి నవీన్ రావు తదితరులు ఉన్నారు.ఈనెల 24వ తేదీన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగిసిన తర్వాత పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు పదవీకాలం ప్రారంభం కానుంది. వీరు ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యులుగా కొనసాగనున్నారు. కాగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన దామోదర్ రావు, పార్థ సారథి రెడ్డిలకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్‌కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు దీవకొండ దామోదర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తనను విశ్వసించి ఇంతటి బాధతను అప్పగించిన సిఎం నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం కృషి చేస్తానని అన్నారు. సిఎం మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంట్‌లో నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అలాగే పార్టీ కోసం ఒక సైనికుడిలా పనిచేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News