Tuesday, April 30, 2024

మా నూరు ప్రశ్నలపై నోరు విప్పండి

- Advertisement -
- Advertisement -

TRS MLA Jeevan Reddy Slams Central Govt

ఏ వర్గానికి మేలు చేశారో చెప్పండి
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదు
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
విదేశాల నుంచి తీసుకొస్తామన్న నల్లధనం ఏమైంది
కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టునైనా దేశంలో కట్టారా?
అన్ని శాఖలకూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు
మోడీ, కిషన్‌రెడ్డి, బండి, అరవింద్‌లు డీగ్యాంగ్‌గా మారారని నిప్పులు చెరిగిన పియుసి చైర్మన్ జీవన్‌రెడ్డి

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పక్షాన తాము సంధిస్తున్న నూరు ప్రశ్నలపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలని పియుసి చైర్మన్ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం కోరుతూ సమాచార హక్కు చట్టం కింద తానే స్వయంగా దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించరు. తాము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కేంద్రాన్ని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. గురువారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో ఏ వర్గానికి మేలు చేసిందో చెప్పాలని నిలదీశారు. మహిళలపై ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. యువకులపై ప్రేమ ఉంటే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పిన మోడీ ఇప్పటి వరకు దీనిపై ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

రాష్ట్రం ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టు అయినా దేశంలో కట్టారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీళ్లిచ్చారా? పేదింటి ఆడపిల్లల పెండ్లి చేసే కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ఏ రాష్ట్రంలోనైనా అమలు చేశారు? రైతు బంధు, దళితబంధు పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయి? అని జీవన్‌రెడ్డి నిలదీశారు. ప్రధాన మంత్రి మోడీ వస్త్రధారణ ఖర్చెంత?ఉక్రెయిన్….-రష్యా యుద్దాన్ని ఎలా ఆపారు?ప్రధాన మంత్రి విదేశీ ప్రయాణాల వ్యయమెంత? పసుపుబోర్డు తెస్తామని రాసిచ్చిన బాండ్ పేపర్ ఏమైందన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుంటే….అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి కాదు… తొండి సంజయ్ అని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ఒక లండు అరవింద్ అని అన్నారు. మోడీ,బండి, అరవింద్, కిషన్ రెడ్డి ‘డీ-గ్యాంగ్‌గా మారారని ఆరోపించారు. ఉక్రెయిన్… రష్యా యుద్ధాన్ని మోడీ ఆపారంటూ ఇటీవల బండి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ….. ఆ యుద్ధాన్ని ఎలా ఆపారో తెలపాలంటూ విదేశాంగ శాఖకు కేంద్ర సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నానని జీవన్‌రెడ్డి వెల్లడించారు.

పెరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి సభకు ఎలా అనుమతి ఇచ్చారు…టిఆర్‌ఎస్‌కు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు మళ్లిస్తున్నారు? కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు ఎందుకు తరలించారు? నిజామాబాద్ కు రావాల్సిన పసుపు బోర్డును ఎందుకు తమిళనాడుకు తరలించారు?.బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది? విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పలు విద్యా సంస్థల ఏర్పాటు ఎందుకు జరగలేదు? రాష్ట్రానికి న్యాయ బద్దంగా రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదు తదితర అంశాలపై సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ…. ప్రతిపక్షం లో ఉన్నపుడు సిలిండర్ ధరల పెంపు లపై గొంతు చించు కుందన్నరు. రాహుల్ గాంధీకి చీరెలు, గాజులు పంపిందని… మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1105లకు పెరిగిందన్నారు. రాహుల్‌గాంధీకి పంపినట్లే…మోడీకి కూడా పంపుతారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. సిఎం కెసిఆర పాలన ఒక తెరిచిన పుస్తకమన్నారు. ఒక సువర్ణ యుగం రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, ఆసరపెన్షన్లు, ఉచిత ప్రసవాలు, కెసిఆర్ కిట్లు వంటి పథకాలతో రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉన్నా అమిత్ షా, బండి సంజయ్‌లు ఫ్లీజ్ ప్లీజ్ అంటూ ….. అధికారం కోసం అడుక్కు తింటున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News