Sunday, May 5, 2024

7న కెసిఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

TRS party meeting chaired by CM KCR on 7th

హైదరాబాద్: కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 7తేదీన మధ్యాహ్నం 2గంటలకు జరుగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రకమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలను ఆహ్వానించారు. కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కాన్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్దరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న జరిగే పార్టీ వార్షిక మహాసభతో పాటు ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News