Friday, May 3, 2024

రైతుల బంద్‌కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్‌ఎస్ శ్రేణులు భారత్ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని స్పష్టం చేశారు. కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారన్నారు. రైతులు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లును టిఆర్‌ఎస్ వ్యతిరేకించిందన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేకునేంతవరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. భారత్ బంద్ విజయవంతానికి టిఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో 11వ రోజుల రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

ఢిల్లీ సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు తరలివస్తున్నారు. సింఘు, ఘాజీపూర్, నోయిడా, టిక్రీ, జరోద సరిహద్దుల దగ్గర లక్షలాది మంది రైతులు నిరసనలు తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు ఆందోళన చేపడుతున్నారు. వ్యవసాయి,విద్యుత్ బిల్లు-2020 ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులతో ఐదుసార్లు సమావేశమైనా చర్చలు కొలిక్కిరావడంలేదు. ఈ నెల 8న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 9న మరోసారి కేంద్రంతో రైతు సంఘాలు చర్చలు జరుపనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News