Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు

- Advertisement -
- Advertisement -

సంబురాల్లో పార్టీ శ్రేణులు

మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపినాథ్, ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ రెం డు స్థానాల్లో విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా పా ర్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నా రు. ఓట్ల లెక్కింపు నాలుగవ రోజు కొనసాగగా శనివారం టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
వాణిదేవికి అభినందనలు : హరీశ్‌రావు
హైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఎంఎల్‌సిగా ఎన్నికైన టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ ప్రజలు సిఎం కెసిఆర్ పక్షాన ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన పట్టభద్రులందరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి విజయం కోసం కష్టించి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ధన్యవాదాలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ వాణిదేవి విజయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. వాణిదేవిని ఆశీర్వదించిన పట్టభద్రులకు, విజయానికి తోడ్పడ్డారంటూ టిఎన్‌జివో, ఇతర సంఘాలకు కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పట్టభద్రులు టిఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేశారన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి రౌండ్‌లో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్నారు. ఏ నమ్మకంతో తమ పార్టీ అభ్యర్థికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
గెలుపు చారిత్రాత్మకం : మంత్రి సత్యవతి
ఎంఎల్‌సిగా టిఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు చారిత్రాత్మకమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎంఎల్‌సిగా విజయం సాధించిన సురభి వాణిదేవికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్‌పై నమ్మకంతో సురభి వాణిదేవికి పట్టం కట్టిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల ప్రచారంలో పసలేదన్న వాదనను పట్టభద్రులు నిజం చేశారని పేర్కొన్నారు. మహిళకు టికెట్ ఇచ్చి గెలుపునకు కృషి చేసి సిఎం కెసిఆర్ మహిళలపై గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు. మాజీ ప్రధాని పివి కూతురు ఎంఎల్‌సిగా గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు. వాణిదేవి విజయం.. పట్టభద్రులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.
వాణిదేవి విజయంపై సౌతాఫ్రికా శాఖ హర్షం
హైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో వాణిదేవి విజయంపై సౌతాఫ్రికా హర్షం వ్యక్తం చేసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఈ విజయంతో స్పష్టమైందని సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు పేర్కొన్నారు. ‘కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నది. గడిచిన ఆరేండ్లలో అనేక అద్భుత విజయాలు నమోదు చేసింది. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధే ఇందుకు సాక్షి. పెరిగిన ఆస్తుల విలువ, మారిన జీవన నాణ్యతే ఇందుకు నిదర్శనం’మని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌న ఆదరించిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
పల్లా, వాణీదేవికి హోంమంత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు ఎస్ .వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించడంపై హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్.వాణీదేవి, పల్లాకు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ .వాణి దేవి, పల్లా విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు. అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా అభ్యర్ధిని ఆదరించిన మహిళలకు ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను, పాలనను మెచ్చి ,నమ్మకంతో ఈ విజయాన్ని అందించిన అందరికీ మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన కోలేటి
ఎం.ఎల్.సి. ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీ దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ హర్షాతిరేకంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎం.ఎల్.సి స్థానాల నుంచీ టి.ఆర్.ఎస్. అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వం పట్ల అన్ని వర్గాల ప్రజలకు గల విశ్వాసానికి, టి.ఆర్.ఎస్. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పట్ల ప్రజల సంతృప్తికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
విజయంపై మలేషియా టిఆర్‌ఎస్ హర్షం
స్థానిక పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో మలేషియా టిఆర్‌ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పట్టబద్రుల ఎన్నికలలో భారతదేశ ఆర్ధిక పితామహుడు పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కడతారని మళ్ళీ రుజువయిందని మలేషియా టిఆర్‌ఎస్‌అధ్యక్షులు చిట్టిబాబు పేర్కొన్నారు. ఎంఎల్‌సి ఎన్నికలముందు ప్రచారంలో భాగంగా తెరాస ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యనిర్వహణ సమావేశంలో టిఆర్‌ఎస్ మలేషియా సభ్యుడు లగిశెట్టి సందీప్ కుమార్ తెలిపినట్లు ఎన్నికలు ఏవైనా తెరాస ఘనవిజయం ఖాయమని తెలిపారని గుర్తు చేశారు.
పట్టభద్రులంతా టిఆర్‌ఎస్ వైపే : మహేశ్ బిగాల
పట్టభద్రులతో పాటు ప్రజలంతా టిఆర్‌ఎస్‌వైపే ఉన్నారని పివి శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, టిఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. హైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎంఎల్‌ఎసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘ఎంఎల్‌సి ఎన్నికల్లో సురభి వాణిదేవి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మునుపెన్నడూ లేని విధంగా పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వాణిదేవి విజయంతో పట్టభద్రులు టిఆర్‌ఎస్‌పై నమ్మకంతో ఓటు వేశారని స్పష్టమైంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత పురోగమించడం ఖాయం’ అని మహేశ్ బిగాల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News