Wednesday, May 8, 2024

ఓడలేదంటూనే ట్రంప్ జంప్?

- Advertisement -
- Advertisement -

Trump announces legal Challenge on Vote Counting

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఇప్పుడు తన న్యాయపోరు విషయంలో తలమునకలయ్యారు. ఎన్నికల రేసు ఇంకా ముగియలేదని ట్రంప్ ఇప్పటికీ చెపుతున్నారు. ప్రత్యర్థి జో బైడెన్ గెలుపును సజావుగా అంగీకరించి వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించడం లేదా ఓటమిని అంగీకరించకుండా ఉన్నందున ఈ దిశలో తగు విధంగా కోర్టుల ద్వారా ఫలితాన్ని అడ్డుకోవడం. ఈ రెండే ఇప్పుడు ట్రంప్ ముందున్న మార్గాలుగా నిలిచాయి. సొంతపార్టీ వర్గాలు, ట్రంప్ సన్నిహితులు, అల్లుడు, భార్య కూడా ట్రంప్‌ను ఓటమి అంగీకారం దిశలో ఒప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ట్రంప్ తన పట్టు సడలించలేదని స్పష్టం అయింది.

సోమవారం నుంచే తన న్యాయపరమైన వ్యాజ్యాల ఉధృతి సాగుతుందని, కౌంటింగ్ ప్రక్రియను సవాలు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో ట్రంప్ ఓడిపోలేదని సౌత్ కరోలినా సెనెటర్ లిండ్సే గ్రహమ్ ఫాక్స్‌న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. ఓటమిని అంగీకరించవద్దు, పోరాడండని లిండ్సే పిలుపు నిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ స్వయంగా ఓటమిని అంగీకరించి పదవి నుంచి తనకుతానుగా వైదొలిగే ప్రశ్నే రాదని ఆయన వైఖరిబాగా తెలిసిన సన్నిహితులు తేల్చిచెప్పారు. అయితే తన పదవీకాలం ముగింపుదశలో ఓటమిని పరిగణనలోకి తీసుకోని వ్యక్తిగానే వైట్‌హౌస్ నుంచి నిష్క్రమిస్తారని చెపుతున్నారు. ఎన్నికలలో తీవ్రస్థాయి అక్రమాలు జరిగాయని, కౌంటింగ్‌ను ఇష్టారాజ్యంగా నిర్వహించారని ట్రంప్ చెపుతూ రావడం కేవలం ఓటమితో గాయపడ్డ ఆయన అహనికి ఓదార్పు తంతు అని, ట్రంప్ అభిమానులకు ఇది చివరి వరకూ నచ్చుతూ ఉంటుందని, అయితే చిట్టచివరికి వ్యవస్థలు ప్రక్రియలు నిర్ధేశించే పరిణామాలతోనే కాకుండా ఆయన స్వయంగానే అధికారానికి దూరం అవుతారని, చరిత్రలో ఓటమిని అంగీకరించకుండా వెనుదిరిగిన నేతగా మిగిలిపోతారని వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.

Trump announces legal Challenge on Vote Counting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News