Thursday, May 2, 2024

ఉత్తిగనే అన్న

- Advertisement -
- Advertisement -

Trump

 

కరోనా రోగుల శరీరంలోకి క్రిమిసంహారకాలు పంపాలన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూ టర్న్

వాషింగ్టన్ : తను చేసిన విపరీత వ్యాఖ్యలు బెడిసి కొట్టి, తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దిద్దుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. కొవిడ్ 19 సోకిన రోగులకు అల్ట్రా వయోలెట్ (యువి) కిరణాలతో లేదా వారి శరీరాల్లోకి క్రిమిసంహారక రసాయనాలు పంపికానీ చికిత్స చేయడం గురించి పరిశీలించా లని ట్రంప్ వైద్య నిపుణులకు చెప్పారు. అయితే, తను కేవలం వ్యంగ్యంగా మాత్రమే అలా చెప్పానని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు సమర్థించుకుంటున్నారు. ట్రంప్ చేసిన సూచనకు ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడు చేసిన ప్రమాదకర సూచనను వినిపించుకోవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

క్రిమి సంహారకాలను శరీరంలోకి ఇన్‌జెక్ట్ చేయడం లేదా తీసుకోవడం చాలా ప్రమాదమని డాక్టర్లు, లైసోల్, డెట్టాల్ తయారు చేసే కంపెనీ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం నాడు ట్రంప్ ఒక బిల్లుపై సంతకం పెడుతున్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై అడగ్గా ‘నేను మీలాగే రిపోర్టర్లనూ వ్యంగ్యంగా అడిగాను ఏం జరుగుతుందో చూడమని. వ్యంగ్యంగా… కేవలం వ్యంగ్యంగానే అడిగాను’ అని ట్రంప్ అన్నారు. క్రిమిసంహారకాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటితో ప్రమాదం లేకుండా చేతులు కడుక్కుంటున్నామని, అలాగే శరీరంలోకి ఇంజెక్ట్ చేయవచ్చు కదా? అని సూచించానని సమర్థించుకున్నారు.

 

Trump U Turn on Disinfection Remarks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News