Sunday, May 5, 2024

నేటి నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి అసెంబ్లీ.. 18న వార్షిక బడ్జెట్

కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు, సందర్శకులకు నో ఎంట్రీ

TRS has Confidence on 2 Graduate MLC Seats

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి ప్రాంగణాలను సమావేశాలకోసం అన్ని విధాలుగా సిద్దం చేశారు. ఉభయ సభల్లోనూ కోవిడ్ ని బంధనల మేరకు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11గంటలకు శాసనసభ, శాసన మండలికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. ఉభయ సభలను ఉ ద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రెండు సభలకు చెందిన సభావ్యవహారాల సలహాసంఘాలు విడివిడిగా సామావేశం కానున్నాయి.
18న బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ఎజెండాను బిఎసిలో నిర్ణయించనున్నారు. చట్టసభల్లో చర్చించాల్సిన అంశాలు ,ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలని అన్నది ఈ సమవేశంలోనే ఖరారు చేస్తారు. ఈ సారి రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సమావేశాలు 15రోజులపాటు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మృతి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్యకు ఈనెల 16న అసెంబ్లీ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈనెల 17న చర్చ జరిపి ,అనంతరం ప్రభుత్వం సమాధానం తెలిపే అవకావం ఉంది. ఈ నెల 18న ఉభయ సభల్లో 2021-2022 ఆర్ధిక సవంత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చలు ,ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చ, ఆమోదం తదతర అంశాలపై ఉభయసభల్లో చర్చ జరగనుంది.
కోవిడ్ నిబంధనలు అమలు
రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్బంగా పూర్తి స్థాయిలో కోవిడ్ నియమ నిబంధనలు అమలు చేయనున్నారు. సభ్యులతోపాటు సిబ్బందికి ,మీడియా ప్రతినిధులకు ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమావేశాలకు వచ్చే వారంతా విధిగా మాస్క్ ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉభయ సభల లోపలా,బయటా రోజకు రెండు సార్లు శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సందర్శకులను అనుమతించటం లేదు.

TS Annual budget Session 2021 starts on March 18

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News