Tuesday, May 21, 2024

ఈ నెల 6న ఎంసెట్ ఫలితాలు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ముందుగా ఈ నెల 5వ తేదీన విడుదల చేయాలని భావించినా ఆ రోజు జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఒక రోజు తర్వాత అంటే 6వ తేదీన ఎంసెట్ ర్యాంకులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,43,165 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,19,187 మంది హాజరయ్యారు. కోవిడ్-19 మార్గదర్శకాలను అనుగుణంగా ఈ నెల 9,10,11, 14 తేదీలలో రోజుకు రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 79 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని సెప్టెంబర్ 18న విడుదల చేసి, 20వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. యుజిసి మార్గదర్శకాల ప్రకారం నవంబరు 1 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల మొదటి వారం లేదా రెండవ వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించి, ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

TS EAMCET 2020 Results Releases on Oct 6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News