Wednesday, May 22, 2024

ఆ స్టార్ డైరెక్టర్‌తో సాయిపల్లవి మూవీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ గా వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో పారితోషికం డబుల్ చేసి వరుసగా నాలుగు, అయిదు సినిమాలకు కమిట్ అయ్యే హీరోయిన్స్ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో సాయి పల్లవి వంటి హీరోయిన్స్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు సైతం ఈమె డేట్ల కోసం ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది ఆమె మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తానంటూ పెద్ద సినిమాలను కూడా కాదంటోంది. నటించేందుకు స్కోపు లేని సినిమాలను కోట్లు ఇచ్చినా చేయను అంటూ ముందే చెప్పేస్తోంది. ఈ సమయంలో ఆమె ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందట. తాజా సమాచారం ప్రకారం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సాయి పల్లవి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు ఒప్పుకుందట. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను దక్కించుంటుకున్న అనీల్ రావిపూడి త్వరలో ‘ఎఫ్ 3 ’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఆ తర్వాత నాగచైతన్యతో మూవీ అంటూ వార్తలు వచ్చాయి. మరి చైతూ సినిమాకంటే ముందు సాయి పల్లవితో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తాడా అనేది చూడాలి.

Sai Pallavi Star in Anil Ravipudi’s New Film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News