Saturday, May 4, 2024

టిఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్- 2023 పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి షెడ్యూలును ప్రకటించింది. ఎంసెట్- 2023 పరీక్షలను మే నెల 7వ తేదీ నుంచి ప్రారంభించి 11వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి శుక్రవారం జెఎన్‌టియు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. మేనెల 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌లోని ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదే వి ధంగా మేనెల 10, 11 తేదీల్లో ఎంసెట్‌లోని అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. అయితే ఈ ఎంట్రన్స్ పరీక్షలన్నీ కం ప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఎంసెట్‌లో ఈ సారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ ఉండబోదన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. టిఎస్ ఎంసెట్ 2023ను జవహర్‌లాల్ నెహు టెక్నలాజికల్ యూనివర్సిటీనే నిర్వహించనుంది. కాగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెసెనల్ కోర్సులైన బిఈ, బిటెక్, బిటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బిఎస్‌సి హానర్స్, అగ్రికల్చర్, బిఎస్‌సి హానర్స్, హార్టికల్చర్, బిఎస్‌సి (ఫారెస్ట్రీ), బివిఎస్‌సి, ఏహెచ్, బిఎఫ్‌ఎస్‌సి, ఫార్మ్‌డి, బిఎస్సీ (నర్సింగ్ కోర్సులు ప్రవేశానికి గాను సిబిటి విధానంలో నిర్వహిస్తామన్నారు.

కాగా టిఎస్ పిజిఈసెట్‌కు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను హైదరాబాద్, వరంగల్ రీజినల్ సెంటర్ల ద్వారా నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ ఫీ ఇందుకు గాను రూ. 1100 గాను, ఎస్‌సి,ఎస్‌టి, పిడబ్లూడి అభ్యర్థులకు గాను రూ. 600 గా రుసుమును నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం పిజిఈఎస్‌ఈటి.టిఎస్‌సిహెచ్‌ఈ.ఏసి. ఇన్‌లో చూసుకోవచ్చు. కాగా ఈ మీడియా సమావేశంలో టిఎస్ ఎంసెట్ 2023 కన్వీనర్ బి. డీన్ కుమార్ , టిఎస్ పిజీఈసెట్ కన్వీనర్ బి. రవీంద్రారెడ్డి, జెఎన్‌టియూ హైదరాబాద్ వీసి కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి సెక్రటరీ ఎన్.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News