Sunday, May 5, 2024

ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు

6,575 కేంద్రాల్లో 90లక్షల టన్నుల సేకరణకు ప్రణాళిక : పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది నుండి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కానున్నట్టు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగికి రైతులనుండి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రమంతటా 6575కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే వీటి సంఖ్యను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17 9కొనగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. యాసంగిలో మొత్తం 52.76లక్షల ఎకరాల్లో వరి పంట సాగలోకి వ చ్చిందని, తద్వారా మొత్తం కోటి 32లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేశామన్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా 90లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి, పట్టుదల, ముందుచూపు, దార్శనికత వల్ల ఆరు దశాబ్ధాల ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వరిసాగులో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

210415నుండి 202021 వానాకాలం వరకూ ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ రూ.68వేల కోట్ల విలువ మేరకు 3.93కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కనీస మద్ధతు ధరలమేరకు రైతులనుండి కొనుగోలు చేసిందని వివరించారు. ఈ ఏడాది వానాకాలంతోపాటు యాసంగితో కలిపి రాష్ట్రంలో 2.37కోట్ల మెట్రిక్‌టన్నుల ధాన్ంయ దిగుబడి కానుందని, అందులో స్థానిక అవసరాలు, లోకల్ మార్కెట్, విత్తన అవసరాలు పోగా మిగిలిన ధాన్యాన్ని తమ సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటికే వానాకాలంలో 48.85లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేయగా, యాసంగిలో 90లక్షల టన్నులు కొనబోతున్నామన్నారు. పంట కోతలను బట్టి దశలవారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా స్థాయిలోనే కలెక్టర్ల అధ్వర్యంలో నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటివరకూ నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 197కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు.
చెల్లింపులకు రూ.20వేలకోట్లు సిద్దం..
ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లో రైతుల ఖాతాకు నిధులు జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం రూ.20వేలకోట్లు అందుబాటులో సిద్దంగా ఉన్నాయన్నారు. ఎన్ని రకాల ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా రైతాంగం సంక్షేమాన్ని కాంక్షించిన ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలుకు నిధులు సమకూర్చినట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూసేపరిస్థితి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17లోపు ఉండే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రానున్నరోజుల్లో దొడ్డు బియ్యానికి గడ్డుపరిస్థితులు ఏర్పడనున్నా యన్నారు. లాభదాకమైన పంటలనే సాగుచేసుకోవాలని రైతులకు సూచించారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ ఎఎఫ్‌సిఐ ద్వారా వేళ్లేదని, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా దొడ్డు బియ్యం పండుతున్నందున సన్నరకాలనే కొనుగోలు చేస్తామని ఎఫ్‌సిఐ తెలిపిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర కార్యదర్శదర్శితో మాట్లాడి ఈ ఒక్కసారికి దొడ్డుబియ్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించారనితెలిపారు. ఈ సీజన్‌లో 80శాతం బాయిల్డ్ రైస్, 20శాతం రా రైస్ తీసుకోవడానికి ఎఫ్‌సిఐ అంగీకరించిందన్నారు.
సీఎంఆర్ బియ్యం 70శాతం క్లియర్
గత వానాకాలానికి సంబంధించిన కష్టమ్స్ మిల్లింగ్ రైస్‌ను వేంగంగా క్లియర్ చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.ఇప్పటికే 70శాతం బియ్యం ఎఫ్‌సిఐకి చేరిందని త్వరలోనే మిగిలిన బియ్యం కూడా క్లియర్ చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
గన్ని సంచులకు సమస్యలేదు
యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గన్ని సంచులకు సమస్య లేదన్నారు. అవసరమైన వాటిలో 46శాతం పాత సంచులు ఉపయోగిస్తున్నామని, 54శాతం కొత్తవాటికి ఆర్డర్ పెట్టామన్నారు. ధాన్యం కోనుగోళ్లలో పిఏసిఎస్, ఐకెపికేంద్రాలకు కమీషన్ చెల్లింపులకు కూడా రూ.1100కోట్లు విడుదల చేసినట్లు ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

TS Govt will purchase entire rabi from Ugadi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News