Sunday, April 28, 2024

జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు!

- Advertisement -
- Advertisement -

Inter-Results

హైదరాబాద్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ప్రారంభమైంది. ముందుగా ఇంటర్ సెకండ్ ఇయర్  జవాబు పత్రాలు దిద్దనున్నారు. తర్వాత మొదటి సంవత్సరం పేపర్లు మూల్యాంకనం చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా మూల్యాంకనం సెంటర్లను 12 నుంచి 33కు పెంచారు. ఈ ఏడాది 9.5లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా… మూల్యాంకనం విధుల్లో 15వేల మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. అన్ని కేంద్రాల్లో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ మూల్యాంకనం జరుపుతున్నామని ఇంటర్ బోర్డు పేర్కొంది. సిబ్బందికి రవాణ, వసతి సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఒక్కో ఉద్యోగికి 3మాస్కులు, శానిటైజర్లు, పోలీసు పాసులను ప్రభుత్వం ఇచ్చింది. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News