Sunday, May 5, 2024

హాజరు కాలేం

- Advertisement -
- Advertisement -

TS Wants GRMB to Postpone Aug 9th Meet

9న జరిగే గోదావరి బోర్డు సమావేశానికి రాలేమని తెలియజేసిన తెలంగాణ
అదే రోజు సుప్రీం కోర్టులో, హరిత ట్రిబ్యునల్‌లో కేసుల విచారణ ఉందని వివరణ
కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్‌రావు విషయంలో ఎపి అభ్యంతరంపై నిరసన
కృష్ణ, గోదావరి బోర్డులు రెండింటికి ఇఎన్‌సి లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: ఈనెల 09వ తేదీన (సోమవారం) జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశాని కి హాజరు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జిఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. ఈ నెల తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉందని ఆ కారణంగా బోర్డు సమావేశానికి హాజరవ్వడం వీలుపడదని ఆయన ఆ లేఖలో తెలిపా రు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శిని సంప్రదించి తదుపరి సమావేశం తేదీ ని ఖరారు చేయాలని, వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయ ంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పడంపై తెల ంగాణ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృ ష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కూడా తెలంగా ణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల సందర్శన కమిటీలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉండడంపై ఎపి అభ్యంతరం వ్యక్త చేసింది. దీనిని తప్పుపట్టిన తెలంగాణ గతంలో పాలమూరు-, రంగారెడ్డి, కల్వకుర్తి సందర్శన సమయంలో కె.శ్రీనివాస్ విషయంలో తాము అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. సీడబ్ల్యూసీ అధికారికి ఎపి ఇతరత్రాలను ఆపాదించడం దురదృష్టకరం, ఇది అనైతికమని వ్యాఖ్యానించింది.

ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేసేందుకే ఎపి ఇలా వ్యవహరిస్తోందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. ఈ సంఘటనను తీవ్రంగా నిరసిస్తున్నామని ఆ లేఖలో పేర్కొం ది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కెఆర్‌ఎంబీ బృందం రాయలసీమ పనులను పరిశీలించి తొమ్మిదో తేదీ లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ కోరింది.

9వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం

9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి(KRMB, GRMB Boards Meeting) సమావేశం జరగనుందని కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు కెఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అజెండా అంశాలపై చర్చకు సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News