Friday, May 10, 2024

వర్షాలతో ప్రజలు జర జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

TSSPDCL CMD says urges people to be careful during monsoon

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ ఛైర్మన్,మేనేజింగ్ డైరక్టర్ రఘుమారెడ్డి తెలిపారు. వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్‌ను ఎటువంటి అంతరాయాలు లేకుండా సరఫరా చేసేందుకు టిఎస్‌ఎస్పీడిసిఎల్ సిద్దంగా ఉందన్నారు. అన్ని సర్కిళ్ళలో ఇప్పటికే విద్యుత్ లైన్లను, డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్) వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం అంతరాయం ఏర్పడినా విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు నిపుణులైన సిబ్బంది అందుబాటులో వుంచినట్లు తెలిపారు. నగరంలో గత రాత్రి కురిసిన వర్షాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంట్రల్ బ్రేక్ డౌన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షం నీరు నిల్వ ఉన్న ప్రతిచోట స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ,తీగలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా ఎక్కడైన రోడ్లు, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియ చేయాలన్నారు. గురువారం రాత్రి కూడా ఒక మోస్తరు భారీ వర్షాలు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాలన్నారు. అంతే కాకుండా లో వోల్జేజ్‌లో హెచ్చు తగ్గులు ఉన్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912/ 100కు స్థానిక ప్యూజ్ ఆఫ్ కాల్‌తో పాటు ప్రత్యేక కంట్రోల్ నెంబర్లు 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతే కాకుండా ఆయన ప్రజలకు వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ క్రింది ప్రత్యేక సూచనలు చేశారు.

* ఓవర్‌హెడ్ పవర్ లైన్స్ కింద నడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఐరన్ కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను,ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలన్నారు.
* అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు తెగిపడిన వెంటనే ప్రజలు 1912, 100, 2111111 వంటి టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలి.
* కరెంట్ షాక్ తగిలితే వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయాలి.
* ఇంట్లో వైరింగ్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, వైరింగ్ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటితో వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటటు చేసుకోవడం కాని, ఇందుకు సంబంధించిన నిపుణులతో వైరింగ్‌ను పునరుద్దరించుకోవాలి.
* గృహాల్లో వైర్లు బాగు చేసేటప్పుడు గుర్తింపు పొందిన విద్యుత్ వైర్లును, పరికాలను మాత్రమే వినియోగించాలి.
* విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో చెత్తను పారవేయ కూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News