Saturday, April 27, 2024

1939లో 33వేల మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 1999లో టర్కీలోని డజ్సీలో 7.4 తీవ్రతతో తలెత్తిన భూకంపంతో 17000కు పైగా మృతి చెందారు. ఇందులో ఇస్తాంబుల్‌లోనే దాదాపు వేయి మంది మృతి చెందారు. 1939లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో టర్కీలో 33వేల మంది వరకూ బలి అయ్యారు. అంతర్యుద్ధపు సిరియాలో పరిస్థితి దారుణంగా మారింది. రెబెల్స్, ప్రభుత్వ అధీన ప్రాంతాల మధ్య తరచూ ఘర్షణలు జరగడం, పలువురు గాయపడటం, పలు చోట్ల సహాయక శిబిరాలు నెలకొన్న దశలోనే ఇప్పుడు ప్రాంతాల తేడా లేకుండా దెబ్బతీసిన భూకంపం నడుమ సహాయక చర్యల పరిస్థితి గందరగోళంగా మారింది.

దెబ్బతిన్న టర్కీ, సిరియాలకు సహాయ చర్యల దిశలో పలు ప్రపంచ దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. టర్కీకి వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను, వైద్య సిబ్బందిని తరలిస్తున్నట్లు, సహాయక సామాగ్రిని పంపిస్తున్నట్లు భారతదేశం తెలిపింది. ఇరుదేశాల్లో తలెత్తిన ప్రకృతి వైపరీత్యం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం తెలిపారు. నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా ఇతర దేశాలు సాయం దిశలో ముందుకు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News