Tuesday, May 21, 2024

టివిఎస్ మోటార్స్-టాటా పవర్ మధ్య ఒప్పందం

- Advertisement -
- Advertisement -

TVS Motors and Tata Power tie

చెన్నై: టివిఎస్ మోటార్స్- టాటా పవర్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఆ రెండు కంపెనీల మధ్య కుదిరిన అవగాహన పత్రం(ఎంఒయు) ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల విద్యుత్ ఛార్జింగ్ వవస్థల వృద్ధి కోసం కలిసి పనిచేస్తాయి. టివిఎస్ మోటార్స్ ప్రాంగణాల్లో సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాట్లు చేయనున్నారు. భారత్‌లో విద్యుత్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

టివిఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు దేశవ్యాప్తంగా టాటాపవర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు టివిఎస్ కనెక్ట్ యాప్, టాటాపవర్ ఇజెడ్ యాప్‌ను వినియోగదారుడు వినియోగించాల్సి ఉంటుంది. సాధారణ ఏసి ఛార్జింగ్‌తోపాటు, డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా పొందే వీలుంటుంది. టివిఎస్ మోటార్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తమ కంపెనీ, టాటాపవర్‌తో భాగస్వామ్యం కావడం ఉత్సాహాన్ని నింపిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News