Saturday, May 4, 2024

కంగనకు ట్విట్టర్ షాక్

- Advertisement -
- Advertisement -

Twitter announced that Kangana account permanently suspended

శాశ్వతంగా అకౌంట్ సస్పెన్షన్

న్యూఢిల్లీ: ట్విట్టర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా నిలుపుదల చేసినట్లు మంగళవారం సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ప్రకటించింది. తమ ట్వీట్ల ద్వారా సమాజానికి హాని చేకూర్చే అవకాశం ఉన్న ఎవరి విషయంలోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు అమలు చేస్తామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, దూషణలతో కూడిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తాము అమలుచేస్తున్న విధానాలను పదేపదే ఉల్లంఘించిన కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ట్విటర్ నిబంధనలను నిష్పక్షపాతంగా, అందరికీ సమానంగా వర్తింపచేస్తున్నామని ఆయన వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News