Tuesday, March 5, 2024

లాక్‌డౌన్‌లో దొంగల చేతివాటం

- Advertisement -
- Advertisement -

Two Robbers arrested by Police

గ్రామాలకు వెళ్లిన నగరవాసులు
తాళం వేసిన శివారు ఇళ్లే టార్గెట్
దుండిగల్, జవహర్‌నగర్, ఎల్‌బి నగర్‌లో దోపిడీలు

మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను దొంగలు అనుకూలంగా మల్చుకుంటున్నారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో చాలామంది గ్రామాల బాటపట్టారు. ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించి దొంగలు తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు. ముఖ్యంగా నగర శివారులో ఉన్న ఇళ్లను లక్షంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. అలాగే చైన్‌స్నాచర్లు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్‌స్నాచర్లు వరుసగా మహిళల మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేశారు. కరోనా సమయంలో చాలామంది ఇళ్ల వద్ద ఉండడం, ఒంటరిగా ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారెగూడెంలో ఇంటి తాళాలు పగులబెట్టి రెండు సిసి కెమెరాలు ధ్వంసం చేసిన దొంగల ముఠా ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

నిందితుల్లో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు సిసిటివి ఫుటేజ్‌లో గుర్తించారు. మరో కొన్ని ఇళ్లల్లో కూడా దొంగతనానికి యత్నించారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో వరుసగా ఐదు ఇళ్లల్లో చోరీలు చేశారు. ఇళ్లల్లో నుంచి 20లక్షల రూపాయల నగదు, 45 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దాదాపు రూ.25లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లోని అల్మారాను పగులగొట్టి దొంగతనం చేశారు. చాలా ఇళ్లల్లో ఇంట్లోని వెనుక డోర్ గడియ పెట్టి లోనికి ప్రవేశించి చోరీ చేశారు. ఎల్‌బి నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లోని శివారులోని ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు చోరీలు చేస్తున్నారు. కరోనా భయం వల్ల చాలామంది శివారు ప్రాంతాల్లోని వారు తాళాలు వేసి గ్రామాలకు వెళ్లిపోయారు.

లాక్‌డౌన్ విధుల్లో పోలీసులు…

మూడు పోలీస్ కమిషనరేట్లలోని పోలీసులు కరోనా విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి పోలీసులు కరోనా విధులు నిర్వర్తిస్తుండడంతో శాంతిభద్రతలు కొంచం నిర్లక్ష్యం చేశారు. దీనికితోడు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టడంతో పోలీసులు 24గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో దొంగలు చోరీలు చేస్తున్నారు, పోలీసుల నిఘా లేకపోవడంతో దొంగల పని సులభంగా మారింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మొత్తం మూడు షిఫ్టుల్లో పనిచేస్తుండడంతో పెట్రోలింగ్ నిర్వహించడంలేదు. పాత నేరస్థులపై నిఘా కూడా పెట్టకుండా పోయింది. ఇదేఅదునుగా భావించిన దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News