Friday, May 3, 2024

కొవిడ్ మృతుల కుటుంబీకులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Rs 50000 Ex Gratia for Families of Covid death

న్యూఢిల్లీ: కుటుంబంలో సంపాదన పరులు ఎవరైనా కరోనాతో మృతి చెందితే ఆ కుటుంబానికి నెలవారీ ఆర్థిక సాయం రూ.2500తోపాటు ఎక్స్‌గ్రేషియాగా రూ.50వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా వల్ల తల్లిదండ్రుల్లో ఎవరిని కోల్పోయినా, లేదా ఇద్దరినీ కోల్పోయినా ఆ పిల్లలకు 25 ఏళ్లు వచ్చేవరకు నెలనెలా రూ.2500 ఆర్థిక సాయం అందచేయడమే కాకుండా వారిని చదివించడమౌతుందని ఆయన వివరించారు. ఢిల్లీ కేబినెట్ ఆమోదం పొందాకే ఇవన్నీ అమలు లోకి వస్తాయని వివరించారు. ఢిల్లీ నగరం లోని 72 లక్షల రేషన్‌కార్డుదారులందరికీ ఈనెల ఉచితంగా 10 కిలోల రేషన్ అందించనున్నట్టు తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా పేదలకు, అవసరమైన వారికి ఉచితంగా రేషన్ సమకూర్చడమౌతుందని చెప్పారు.

సింగపూర్ విమాన సర్వీస్‌లు రద్దు చేయాలి
పిల్లలకు చాలా ప్రమాదకరమైన కరోనా కొత్త వేరియంట్ సింగపూర్‌లో వ్యాపిస్తున్నందున సింగపూర్ నుంచి విమానాల రాకపోకలను తక్షణం రద్దు చేయాలని కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వైరస్ కొత్తరకం మనదేశానికి కూడా మూడోవేవ్‌గా వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. సింగపూర్ నుంచి విమానాల సర్వీస్‌ను రద్దు చేయడంతోపాటు పిల్లలకు ప్రాథాన్యమిచ్చి ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ అభివృద్ధి చేయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత దేశంలో మొదట గుర్తించిన కరోనా రకంతో సింగపూర్ పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని మీడియా కథనాలు వెలువడడంతో కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సింగపూర్ లోని కరోనా వైరస్ రకం గురించి ఏం తెలియకపోయినా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సింగపూర్ విమాన సర్వీసులను రద్దు చేయాలని కోరారు. ఈ మీడియా కథనానికి నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె పాల్ స్పందించి తాము దీన్ని పరీక్షిస్తామని చెప్పారు.

Rs 50000 Ex Gratia for Families of Covid death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News