Friday, April 26, 2024

జె అండ్ జె వ్యాక్సిన్ ఎక్స్‌పైరింగ్ గడువును 6 వారాలు పెంచిన అమెరికా

- Advertisement -
- Advertisement -

U.S. extends J&J vaccine expiration deadline by 6 weeks

 

వాషింగ్టన్: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన కొవిడ్19 వ్యాక్సిన్ వినియోగ తుది గడువును (ఎక్స్‌పైరింగ్ గడువును) ఆరు వారాలపాటు పెంచుతున్నట్టు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డిఎ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్ద ఈ వ్యాక్సిన్ ఎక్స్‌పైరింగ్ గడువును మూడు నెలలుగా ఎఫ్‌డిఎ నిర్ణయించింది. ఇపుడు పెంచినదానితో నాలుగున్నర నెలల వరకు వ్యాక్సిన్ నిల్వ చేసే అవకాశం లభించింది. ఇప్పటికే మిలియన్లకొద్దీ వ్యాక్సిన్లను జాన్సన్ కంపెనీ తయారు చేసింది. గత లెక్క ప్రకారం వాటిలో చాలా వరకు ఈ నెల చివరన గడువు తీరిపోనున్నాయి. వ్యాక్సిన్లను వృథాగా పడేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడేసేలా ఎఫ్‌డిఎ నిర్ణయం వీలు కల్పించింది. ఫైజర్, మోడెర్నా కంపెనీల వ్యాక్సిన్ల ఎక్స్‌పైరింగ్ గడువును ఆరు నెలలుగా ఎఫ్‌డిఎ నిర్ణయించింది. అయితే, ఈ రెండు వ్యాక్సిన్లను అతిశీతల పరిస్థితిలో నిల్వ చేయాలి. అమెరికాలో ఇప్పటివరకు జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్లను కోటీ 10 లక్షల డోసులమేర వినియోగించారు. మరో కోటి డోసుల్ని పలు రాష్ట్రాలకు పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News