Tuesday, April 30, 2024

బ్రిటన్‌లో ఖల్సా టీవీ ప్రసారాలపై వేటు

- Advertisement -
- Advertisement -

UK media watchdog suspends Khalsa TV

లండన్: ఖలిస్తానీ ప్రచారంతో ప్రసార నిబంధనలను కెటివి చానల్ ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో బ్రిటన్‌లో ఖల్సా టెలివిజన్ సంస్థ ప్రసారాలను బ్రిటన్‌కు చెందిన మీడియా నియంత్రణ సంస్థ నిలిపివేసింది. గత ఏడాది డిసెంబర్ 30న కెటివి చానల్‌లో ప్రసారం చేసిన ప్రైమ్ టైమ్ కార్యక్రమం హింసను ప్రేరేపించే విధంగా ఉందని, ఇది ప్రసార నియమనిబంధనల ఉల్లంఘనేనంటూ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్(ఆఫ్‌కమ్) గత వారం ఖల్సా టెలవిజన్ కంపెనీకి సస్పెన్షన్ నోటీసు జారీచేసింది. 95 నిమిషాలపాటు సాగిన ఆ కార్యక్రమంలో ప్రసారం చేసిన అంశాలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆఫ్‌కమ్ పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం బలోపేతానికి హత్యలు చేయడం కూడా ఆమోదయోగ్యమేనంటూ ఆ కార్యక్రమ వ్యాఖ్యత మాట్లాడారని, ఇది ఆమోదయోగ్యం కాదని ఆఫ్‌కమ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఖల్సా టెలివిజన్ కంపెనీకి చెందిన ప్రసార లైసెన్సును బ్రిటన్‌లో తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News