Thursday, May 16, 2024

క్రికెట్ మ్యాచ్‌లో తప్పుడు నిర్ణయం తీసుకున్న ఎంపైర్‌ను పొడిచిన ప్లేయర్స్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: క్రికెట్ మ్యాచ్‌లో తప్పుడు నిర్ణయం తీసుకున్న ఎంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లా చౌద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మణిసాలందా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మణిసాలందా గ్రామానికి చెందిన లక్కీ రౌత్, ప్రీతిరంజన్ అనే వ్యక్తులు ఎంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. శంకర్‌పూర్, బ్రహ్మాపూర్ గ్రామాల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు లక్కీ రౌత్ అనే వ్యక్తి ఎంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్ జరుగుతున్నపుడు లక్కీ రౌత్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో బ్రహ్మాపూర్ గ్రామానికి చెందిన టీమ్ సభ్యులు గొడవకు దిగారు.

గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో బ్రహ్మాపూర్ టీమ్ సభ్యులలో స్మృతి రంజన్ రౌత్ అలియాస్ మున్నా అనే యువకుడు కత్తి తీసుకొని లక్కీ రౌత్‌ను పొడిచాడు. వెంటనే లక్కీ రౌత్‌ను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మున్నా ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. మున్నా స్నేహితుడిని మణిసాలందా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముగణి రౌత్, జగ రౌత్ ఇద్దరు కలిసి లక్కీ పట్టుకోవడంతో స్మృతి రంజన్ రౌత్ కత్తితో పొడిచాడని, లక్కీ తలపై జగ రౌత్ బ్యాట్‌తో బాదాడని గ్రామస్థులు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసిపి అరుణ్ స్వైన్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News