Saturday, May 4, 2024

అవకాశమిస్తే మరో పర్యాయం కొనసాగుతా

- Advertisement -
- Advertisement -
UN chief Antonio Guterres declares he will seek second term
యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి(యునైటెడ్ నేషన్స్) సెక్రటరీ జనరల్‌గా తాను రెండవ దఫా మరో ఐదేళ్లపాటు పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆంటోనియో గుటెర్రెస్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్‌కిర్‌కి ఒక లేఖ రాస్తూ ఐక్యరాజ్యసమితి ఆశయాలు, నిర్దేశిత లక్ష్యాలను సాధనకు కృషిచేసేందుకు మరో విడత తనకు అవకాశం కల్పించాలని కోరారు. 2016 అక్టోబర్‌లో జరిగిన సెక్రటరీ జనరల్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా పోర్చుగీస్ మాజీ ప్రధాని, యుఎన్ శరణార్థ విభాగాధితపతి అయిన గుటెర్రస్ ఎన్నికయ్యారు. 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీ ఆయనను ఎన్నుకుంది. 2017 జనవరి 1న ఆయన బాన్ కీ-మూన్ నుంచి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. సభ్య దేశాలు కోరుకుంటే రెండవ దఫా పదవీ బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధమని గుటెర్రస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News