Wednesday, May 1, 2024

వెంటిలేటర్లు, రెమిడెసివిర్, వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన 11 రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

Union Health Minister Harsh vardhan review with states

వ్యాక్సిన్లకు కొరత లేదన్న కేంద్రం

రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ సమీక్ష

న్యూఢిల్లీ: తమకు మరిన్ని ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కావాలని 11 రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రాల్లో కొవిడ్19 కేసులు పెరుగుతున్నందున బాధితులకు వైద్యం అందించడంలో మౌలిక వసతులకు కొరత లేకుండా చూడాలని ఆ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్,రాజస్థాన్,గుజరాత్,మధ్యప్రదేశ్, కేరళ, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్యశాఖల మంత్రులు పాల్గొన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని, రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. వ్యాక్సిన్లకు కొరత లేదని ఈ సందర్భంగా హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు.

డబుల్ మ్యుటేంట్ వైరస్‌పై మహారాష్ట్ర ఆందోళన వ్యక్తం చేయగా, తమ రాష్ట్రంలో కేసులు పెరిగినందున 2020లో వలె కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని ఢిల్లీ కోరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో అందుబాటులో ఉన్న ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ నిల్వలపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషన్ వివరాలందించారు. మహారాష్ట్రకు 1121, ఉత్తర్‌ప్రదేశ్‌కు 1700, జార్ఖండ్‌కు 1500, గుజరాత్‌కు 1600, మధ్యప్రదేశ్‌కు 152, చత్తీస్‌గఢ్‌కు 230 వెంటిలేటర్లు పంపనున్నట్టు హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సిన్ల గురించి రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లపై హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇప్పటికే 14.5కోట్ల డోసులు పంపామని, వాటిలో 12.57 కోట్ల డోసులు(వృథాతో కలిపి) వినియోగించాయని తెలిపారు. మరో 1.58 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వారం రోజుల్లో 1.16 కోట్ల డోసులు పంపిస్తామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ల నిల్వలపై పెద్ద రాష్ట్రాల్లో నాలుగు రోజులకోసారి, చిన్న రాష్ట్రాల్లో వారం రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్లకు కొరత లేదని హర్షవర్థన్ మరోసారి హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News