Sunday, May 12, 2024

ఉమ్మడి పౌరచట్టంపై కాంగ్రెస్ పిల్లిచేష్టలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై కాంగ్రెస్ పార్టీ ధోరణి విచిత్రంగా ఉందని బిజెపి విమర్శించింది. కీలకమైన అంశంపై కాంగ్రెస్ ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి వ్యవహరించాలనుకుంటున్నట్లుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆదివారం బిజెపి తరఫున మండిపడ్డారు. సివిల్ కోడ్‌కు సంబంధించి బిజెపికి పూర్తి మద్దతు దక్కుతుందని, పైగా ఇతర పార్టీలలోని నేతలు కూడా దేశం సమైక్యంగా ఉండాలని భావిస్తున్నారని తెలిపారు. సివిల్ కోడ్ అత్యవసరం అని రాజ్యాంగం తెలిపింది. సుప్రీంకోర్టు కూడా దీని ప్రాధాన్యతను వివరించిందని మంత్రి గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ఇప్పుడు కూడా విచిత్ర రీతిలో డోలాయమాన స్థితిలో పడ్డారని విమర్శించారు.

యుసిసిని తీసుకురావాలని సుప్రీంకోర్టు ఐదు దఫాలుగా సాగిన వేర్వేరు విచారణల దశల్లో అభిప్రాయపడిందని తెలిపారు. సివిల్‌కోడ్ అంశంపై శనివారం కాంగ్రెస్ స్పందించింది. ఇప్పుడున్న స్థితిలో ఈ కోడ్ అవసరం లేదనే తమ పాత వాదనకు కట్టుబడి ఉంటామని తెలిపింది. పైగా నివేదిక లేదా ముసాయిదా బిల్లు వస్తే పరిశీలించి స్పందించడం జరుగుతుందని పేర్కొంది. ఈ విధమైన తటపటాయింపుల వైఖరితో ఉన్న కాంగ్రెస్ చివరికి ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి క్రాస్ పార్టీ పద్ధతికి దిగుతోందని మంత్రి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News