Sunday, April 28, 2024

తెలుగు రాష్ట్రాల సిఎంలకు కేంద్రమంత్రి షెకావత్ లేఖ

- Advertisement -
- Advertisement -

KCR Jagan Discussion on Water Distribution

న్యూఢిల్లీ: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ శనివారం లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డిపిఆర్ లు వెంటనే ఇవ్వాలని షెకావత్ స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ 6న ఇద్దరు సిఎంలు, మంత్రులు, అధికారులతో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను రెండు రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశించారు. తెలంగాణ, ఎపి, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి అన్నారు. 19 ప్రాజెక్టుల డిపిఆర్ లు పంపించాలని ఎపిని, 15 ప్రాజెక్టుల డిపిఆర్ లు పంపాలని తెలగాణను కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ప్రాజెక్టుల డిపిఆర్ లు ఆమోదించేవరకూ నిర్మాణాలు చేయవద్దని షెకావత్ ఆదేశించారు. డిపిార్లు వీలైనంత త్వరగా మదింపు చేస్తామని కేంద్ర జవలనరులశాఖ పేర్కొంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Union Minister Shekhawat Letter to Telugu States CMs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News