Monday, May 6, 2024

ఉప్పల్ స్టేడియంపై చిన్నచూపు… భారత్ మ్యాచ్ లు లేవు

- Advertisement -
- Advertisement -

దక్కని భారత మ్యాచ్‌ల ఆతిథ్యం
నిరాశలో క్రికెట్ అభిమానులు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్ వేదికల ఎంపికలో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అనుసరించిన పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌కు మొత్తం పది నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చెన్నై, లక్నో, హైదరాబాద్, ధర్మశాల, పుణె వేదికలుగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈసారి లీగ్ దశలో భారత్ మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీమిండియా ఆడే మ్యాచ్‌లలో ఒక్కటి కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. హైదరాబాద్‌తో పోల్చితే చిన్న స్టేడియాలుగా పరిణగించే ఢిల్లీ, లక్నో, ధర్మశాల, పుణెలకు భారత్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం కల్పించారు. కానీ దేశంలోని ప్రధాన స్టేడియాల్లో ఒకటిగా పేరున్న ఉప్పల్‌లో మాత్రం భారత్‌కు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించడం లేదు.

Also Read: గ్రూప్ 4కు పరీక్షకు సర్వం సిద్ధం

వరల్డ్‌కప్ వేదికల ఖరారులో బిసిసిఐ కార్యదర్శి జైషా మార్క్ స్పష్టంగా కనిపించింది. వేదికల ఖరారులో అతని మాటే చెల్లుబాటు అయ్యింది. దీనికి వేదికల కేటాయింపుల్లో అహ్మదాబాద్ నగరానికి ఇచ్చిన ప్రాధాన్యతే నిదర్శనంగా చెప్పొ చ్చు. ఆరంభ మ్యాచ్‌తో పాటు ప్రపంచకప్‌కే హైలైట్‌గా పరిగణిస్తున్న దాయాదిలు భారత్‌పాకిస్థాన్ జట్ల మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌కే దక్కిం ది. దీంతో పాటు ఫైనల్ సమరం కూడా అహ్మదాబాద్‌లోనే జరుగనుంది. ఇక కోల్‌కతా, ముంబై, చెన్నై, లక్నో నగరాలకు కూడా మంచి ప్రాధాన్య తే లభించింది. చెన్నైలో ఆస్ట్రేలియా, కోల్‌కతాలో సౌతాఫ్రికా, లక్నోలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం టీమిండియాకు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా లేక పోవడం గమనార్హం. దాదాపు 60 వేల ప్రేక్షకుల సామర్థం కలిగి, అధునాతన డ్రైనేజీ సౌకర్యం కలిగిన ఉప్పల్ స్టేడియంపై బిసిసిఐ ఎందుకు చిన్నచూపు చూసిందో అర్థం కావడం లేదు. పాకిస్థాన్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఆడే ఒక మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భారత మ్యాచ్‌లు లేక పోవడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి ఉప్పల్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన స్టేడియంగా పేరు తెచ్చుకున్న ఉప్పల్‌లో ఇటీవల ఐపిఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి మ్యాచ్ అభిమానులతో కిక్కిరిసి పోయింది.

ఎలాంటి లోటు లేకుండా ఐపిఎల్ మ్యాచ్‌లు సా ఫీగా సాగిపోయాయి. దీంతో ఈసారి భారత్‌కు సంబంధించిన ప్రపంచకప్ మ్యాచ్‌లు ఉప్పల్‌లో జరగడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ బిసిసిఐ మాత్రం హైదరాబాద్‌పై తన సవతి ప్రేమను మరోసారి చాటుకుంది. ఈసారి భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఉప్పల్‌లో నిర్వహించకుండా షాక్ ఇచ్చింది. ఇదిలావుంటే గతంలో ఉప్పల్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అక్రమా లు జరగడం, ఇది దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించడంతో బిసిసిఐ వెనుకంజ వేయడానికి ప్రధాన కారణంగా హెచ్‌సిఎకు చెందిన కొం త మంది ప్రతినిధులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగినా టికెట్ల అమ్మకాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడం అనవాయితీగా మారింది. వీటిని దృష్టిలో పెట్టుకునే బిసిసిఐ పెద్దలు హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News