Thursday, May 2, 2024

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే

- Advertisement -
- Advertisement -

TPCC Chief Uttam

హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆదాయపు పన్నులో స్లాబ్‌ల మార్పులు తప్పా, నూతనంగా ఏమి లేదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగాల సృష్టించే రంగాల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బం పెరుగుతుందని , ఇందుకు ఉపశమన మర్గాలు ప్రస్తావించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

2022లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించడం ఎలా సాధ్యమైతుందొ అంతు చిక్కని అంశంగా వాపోయ్యారు. వాస్తవానికి శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే 201920 గతంలో అమలు చేసిన పంటల రుణమాఫి, పథకాలు,ఆర్థిక సర్వేకు సంబంధించిన అంశాలుగా లేవని వ్యాఖ్యనించారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రేట్టింపు చేయాలనుకుంటే, వ్యవసాయ వృద్ధి రేటు కనీసం 11శాతం ఉండాలన్నారు. 201920 ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి రేటు 2.9 శాతంగా మాత్రమే ఉందన్నారు.

కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి చాలా నిరాశపరిచిందన్నారు. పన్నుల పంపిణి పై ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 201415 నుండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వాపోయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాల పై పార్లమెంట్ సమావేశాలల్లో కాంగ్రెస్ ఎంపిలు నిలదీస్తారని ఆయన స్పష్టం చేశారు.

Uttam Kumar Reddy Comments on Central Budget 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News