Sunday, April 28, 2024

సెప్టెంబర్ 5 లోగా టీచర్లకు టీకాలు

- Advertisement -
- Advertisement -
Vaccinate all school teachers by September 5
రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ : అన్ని రాష్ట్రాల్లోని టీచర్లకు సెప్టెంబర్ 5 లోపు టీకాలు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కోరారు. దీని కోసం రాష్ట్రాలకు అదనంగా రెండు కోట్ల టీకాలను అందుబాటు లోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. టీకాల కార్యక్రమంలో వారికి ప్రాధాన్యం ఇచ్చి టీచర్స్ డే కంటే ముందే లక్షాన్ని పూర్తి చేయాలన్నారు. గత ఏడాది మార్చిలో దేశం మొత్తం మీద పాఠశాలలను మూసివేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. గత అక్టోబర్ తరువాత కొవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను తెరిచాయి. కానీ సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ మూసివేశారు. తాజాగా మరోసారి వివిధ రాష్ట్రాలు పాఠశాలలను తెరిచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ చాలా చోట్ల సిబ్బందికి టీకాలు ఇవ్వక పోవడంతో కొవిడ్ ప్రబలే ముప్పు తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్రం అదనపు డోసులను అందుబాటు లోకి తీసుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News