Tuesday, May 21, 2024

‘గ‌ని’ ఫస్ట్ పంచ్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడు నటిస్తున్న తాజా చిత్రం ‘గ‌ని’. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసిన మూవీమేకర్స్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ మూవీని నుంచి ‘గ‌ని’ ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే, కన్నడ హీరో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్‌ ఎస్‌ త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 3న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Varun Tej’s GHANI First Punch Glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News