Wednesday, May 1, 2024

సందీప్ రెడ్డి-ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’..

- Advertisement -
- Advertisement -

బాహుబ‌లి త‌ర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ మూవీ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ మూవీలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ ఈ మూవీ చేస్తున్నాడు. కొద్దిసేటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 8 భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో నటించే నటీనటుల వివరాలను త్వరలో చిత్రయూనిట్ వెల్లడించనుంది.

Prabhas’ 25th film ‘Spirit’ announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News