Tuesday, May 14, 2024

వాహన చోదకుల ఎత్తుకు పోలీసుల పైఎత్తు

- Advertisement -
- Advertisement -

జిపిఎస్ ద్వారా ప్రయాణించిన దూరం గుర్తింపు
మూడు కిలోమీటర్లు దాటితే వాహనం స్వాధీనం
ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్

 

మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్లపై తిరిగేవారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణించిన వాహనాలను గుర్తించేందుకు పోలీసుల శాఖ ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిని ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టంతోపాటు జిపిఎస్ ద్వారా ప్రయాణించిన దూరం గుర్తించి ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదుచేయనున్నారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారిపై కేసులతో సరిపెట్టకుండా వారికి జరిమానాలను విధించనున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం అనే ప్రత్యేక యాప్‌ను కూడా పోలీసు శాఖ రూపొందించింది.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి ఈ యాప్‌ను వినియోగిస్తోంది. నిత్యావసరాలు కొనుగోలు చేసే వారు సాయంత్రం ఏడు గంటల్లోపు ఇంటికి చేరుకోవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలని స్పష్టం చేసింది. కానీ, దీన్ని అలుసుగా తీసుకొని చాలా మంది రోడ్లపై మూడు కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తున్నారు. వహనాలను నిలిపి పోలీసులు ప్రశ్నిస్తే ఇప్పుడే తాము నిత్యావసరాల కోసమే వచ్చామని, మూడు కి.మి. దాటలేదని బుకాయిస్తున్నారు. కాగా పోలీసు శాఖ కొత్తగా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ సాయంతో అలాంటి వారిని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్లపై కనిపించిన వాహనం నంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వ్యక్తి మరికొంత దూరం ప్రయాణించాక అక్కడున్న పోలీసులు కూడా ఇదే విధంగా చేస్తారు. ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు వివరాలను క్రోడీకరించి . జిపిఎస్ ద్వారా పని చేసే ఈ యాప్‌లో ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించాడో గుర్తిస్తారు. వాహనచోదకులు ఎన్నికిలోమీటర్లు ప్రయాణించారో తెలుసుకుని వారు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదుతో పాటు జరిమాన విధిస్తారు.

 

Vehicle seized with out Lock down in Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News