Tuesday, May 14, 2024

ఎస్‌టి గురుకుల విద్యార్థుల కోసం ‘ఓక్స్ యాప్’

- Advertisement -
- Advertisement -

'Oaks App' for ST Gurukul Students

 

హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఓక్స్(ఆన్‌లైన్ అడాప్టివ్ నాలెడ్జ్ సిస్టమ్) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటి(టిటిడబ్లూఆర్‌ఇఐఎస్) కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, ఓక్స్ యాప్ ద్వారా 6 నుంచి 9 తరగతులకు చెందని పాఠాలు, వీడియోలు, పరీక్షలు రాయడం, అసైన్‌మెంట్స్ తదితర కార్యకలాపాలు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా చేయవచ్చని అన్నారు. మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఇతర సబ్జెక్టులు ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కెజి టు పిజి మిషన్ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

 

‘Oaks App’ for ST Gurukul Students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News