Monday, April 29, 2024

పోలీసులకు ‘చిరు’ ప్రశంస.. స్పందించిన డిజిపి

- Advertisement -
- Advertisement -

Chiranjeevi, DGP

మనతెలంగాణ/హైదరాబాద్‌ః కరోనా కట్టడికి ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి ట్వీట్ పై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి స్పందించారు. కేవలం మాకు మాత్రమే ప్రేరణ కలిగించలేదు. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారు అంటూ డిజిపి కితాబునిచ్చారు. ఒక పోలీసు కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వచ్చిన మాటలు కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పారు. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.

నేను హైదరాబాద్‌లో ఉండి స్వయంగా చూశాను. పోలీసుల పనితీరు వల్లే లాక్‌డౌన్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. దాని వల్లే కరోనా విజృంభణ చాలా వరకు అదుపులో వచ్చింది. నేను ఈ సందర్భంగా సామాన్య జనాన్ని వేడుకునేది ఒకటే. ఈ కరోనాని అంతమొందించడంలో పోలీసులకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీసు శాఖ వారు చేస్తున్న ఈ అమోఘమైన ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను అని చిరు అన్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో డాక్టర్స్, పోలీసులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు ఎంతగానో కృషి చేస్తుంటే పోలీసు శాఖవారు రోడ్లపై ఉండి ప్రజలు సామాజిక దూరం పాటించేలా, గుంపులుగా తిరగకుండా ఉండేలా పలు చర్యలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే మహేశ్, చైతన్య పోలీసు శాఖను ట్విట్టర్ వేదికగా అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను అభినందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Chiranjeevi Salute to TS Police fight against Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News