Wednesday, May 1, 2024

కొరియన్ మూవీ రీమేక్‌లో…

- Advertisement -
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ‘నారప్ప’ సినిమాతో వస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది సూపర్ హిట్ తమిళ మూవీ ‘అసురన్’ కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మాత డి.సురేష్ బాబు ఇటీవల కొరియన్ మూవీ ‘లక్కీ కీ’ని రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2016లో దక్షిణ కొరియాలో కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘లక్కీ కీ’ మంచి విజయం సాధించింది.

ఈ మూవీకి సంబంధించిన అన్ని భారతీయ భాషల రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నామని.. పాపులర్ హీరో, డైరెక్టర్‌తో ఈ సినిమా చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కలిసి నిర్మించనున్నాయి. అయితే ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో అతను విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ స్టార్ హీరో కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కాగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా ఇంతకుముందు ‘ఓ బేబీ’ సినిమాను నిర్మించాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రాన్ని కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా రూపొందించారు. ఇప్పుడు మరో కొరియన్ మూవీ ‘లక్కీ కీ’ రీమేక్ కోసం సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కలుస్తున్నాయి.

Venkatesh to act in Korean Movie Remake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News