Friday, May 10, 2024

కీలక ఘట్టం పూర్తి

- Advertisement -
- Advertisement -

Victory Venkatesh's look as Narappa is very intense

 

విక్టరీ వెంకటేష్ తన సినిమా ‘నారప్ప’ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే 70 శాతం షూటింగ్ ముగియగా.. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్‌ను పూర్తి చేయడానికి హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ షెడ్యూల్‌లో చేస్తోన్న సీన్స్ సినిమాలోనే కీలకమైనవి అట. అయితే ఈ సీన్స్‌లోనే కీలక ఘట్టమైన ఓ సన్నివేశం షూటింగ్‌ను తాజాగా పూర్తి చేశారని తెలిసింది. ఈ కీలక ఘట్టం షూటింగ్‌లో వెంకీ సహా ముఖ్యమైన నటీనటులంతా పాల్గొన్నారు. ఇక లాక్ డౌన్‌కి ముందు రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని వెంకీ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ ఆయన ఆకట్టుకున్నారు. కాగా తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News