Sunday, April 28, 2024

వినాయక చవితి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Vijay Sethupathi 'Laabam' Film Release on Sep 9

విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ తెలుగులో విడుదల చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈనెల 9న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “వినాయక చవితి కానుకగా ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో ‘లాభం’ విడుదల కానుంది. డిఫరెంట్ కానెప్ట్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై విడుదల చేస్తుండడం హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిత్రం” అని అన్నారు.

Vijay Sethupathi ‘Laabam’ Film Release on Sep 9

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News