Thursday, May 16, 2024

దళపతి విజయ్ ‘బీస్ట్’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Vijay Thalapathy 65th movie first look released

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ తన అభిమానులకు బర్త్ డే ట్రీట్‌ ఇచ్చాడు. మంగళవారం(జులై 22) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న 65వ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకు బీస్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీకి సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ వెల్లడించనున్నారు.

Vijay Thalapathy 65th movie first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News