Tuesday, May 7, 2024

సర్పంచ్ నుంచి సిఎం దాకా సాయి ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత అయిన విష్ణుదేవ్ సాయి అంచెలంచెలుగా రాజకీయాలలో ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ముందుకు సాగింది. పార్టీలో పలు కీలక సంస్థాగత పదవులలో కూడా ఆయన రాణించారు. పలుసార్లు లోక్‌సభ ఎంపి అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.మోడీ తొలికేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ బిజెపికి ఆయన మూడుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. జష్పూర్ జిల్లాకు చెందిన సుర్గూజా ప్రాంతంలోని కుగ్రామం బగియా ఆయన జన్మస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత, ఇతర సమీప బంధువులు కూడా నేతలుగా పలుకుబడి సాధించారు.

ఈ నేత అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం జనాభాలో వీరు దాదాపుగా 32 శాతంగా ఉంది. ఒబిసిల తరువాత రాష్ట్రంలో అత్యంత ప్రాబల్యపు సామాజిక వర్గంగా ఉంది. మాజీ సిఎం రమణ్ సింగ్‌కు విష్ణుదేవ్ కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు. రా్రష్ట్రంలో బిజెపికి రమణ్ సింగ్ తలమానికం అయ్యారు. దీనితో ఆయన మనిషిని ఇప్పుడు సిఎం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత రమణ్‌సింగ్‌కు బాధ్యతలు చేపడుతారని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆదివాసీ నేత ఎంపిక జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News